Friday, 15 February 2013

Safe Foods Copy Telugu



ఆహరం సరియైనది కానప్పుడు ఔషధం వాడినా ప్రయోజనం ఉండదు  
ఆహరం సరియైనది  అయినప్పుడు ఔషధం యొక్క అవసరం ఉండదు 
                                                                - ఆయుర్వేద సూక్తి 

మన ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్నే కాక పర్యావరణాన్ని సైతం ప్రభావితం చేస్తాయి. తరాలు  మారుతున్న కొద్దీ మనందరి ఆరోగ్యం క్షీణించడం మనం చూస్తున్నాము. ఇందుకు గత కొన్ని ఏళ్ళలో మన ఆహారంలో వచ్చిన మార్పులే ప్రధాన కారణం . నేడు ఆహరం రసాయనిక క్రిమిసంహారకాలు మరియు ఎరువులతో నిండి ఉంది. రైతన్నలు సైతం అధిక దిగుబడుల కోసం రసాయనిక పద్ధతుల వైపే మొగ్గు చూపుతున్నారు. 

ఇలా అధికంగా రసాయినిక పద్ధతులు ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యనికి మరియు పర్యావరణానికి హాని  చేకూరుతున్నది. ఈ మధ్య కాలంలో పెరుగుతున్న గుండె జబ్బులకు మరియు పక్షవాత వ్యాధులకు, మన ఆహారంలో నిమిడీకృతమైన రసాయనాలే కారణమని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. కొన్ని క్రిమిసంహారకాలు ప్రాణాధార అవయవాలలో సమస్యలకు కారణం అవ్వడమే కాక ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి సైతం కారణం అవుతున్నాయి. 

ఇటువంటి విషపూరితమైన రసాయనాలు  కలిగి ఉన్న ఆహారం నుండి మనల్ని కాపాడుకోవడానికి చేస్తున్నఒక  ప్రయత్నమే ఈ పెరిగ్రీన్ సేఫ్ ఫుడ్స్ 


పెరిగ్రీన్ సేఫ్ ఫుడ్స్ యొక్క విశిష్ఠతలు: 
  1. పెరిగ్రీన్ సేఫ్ ఫుడ్స్ యొక్క  పండ్లు మరియు కూరగాయలు నైపుణ్యత కల మరియు  అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పండించబడుతున్నాయి 
  2. మా ఉత్పత్తులు ఆరోగ్యవంతమైన నేలలో, మంచి సాగునీటిని ఉపయోగించి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను పాటించి పండించబడుతున్నాయి 
  3. పర్యావరణానికి కానీ మనుషుల ఆరోగ్యానికి కానీ ఎటువంటి హాని కలిగించని క్రిమిసంహారకాలను ఉపయోగించి మా ఉత్పత్తులు పండించబడుతున్నాయి
  4. మేము మా తోటల పోషణలో సేంద్రియ ఎరువులు, గోఆధారిత ఉపయుక్తములు మరియు వేప ఎరువులు ఉపయోగిస్తున్నాము
  5. క్రిమిసంహారక అవశేషాలు లేని సురక్షితమైన, నాణ్యమైన, పరిపుష్టి కలిగిన పండ్లు మరియు కూరగాయలను సరసమైన ధరలకు మీ ఇంటి ముంగిట్లో అందించడానికి పెరిగ్రీన్ సేఫ్ ఫుడ్స్ కృషి చేస్తన్నది 
  6. పెరిగ్రీన్  సేఫ్ ఫుడ్స్ పండ్లు మరియు కూరగాయలను చక్కటి పరిపక్వతకు వచ్చిన తరువాత మాత్రమే కోసి, నాణ్యమైన వాటినే ఎంపిక చేసి, వాటిని జాగ్రత్తగా రవాణా చేసి మీ అవసరాలకు అనుకూలంగా బుట్టలలో అమర్చి తోట నుండి నేరుగా మీ ముంగిట చేరవేస్తుంది